తమిళనాడు లో ఓ ప్రామాదకర ప్లాంట్ ఉంది. అది ప్రజలకు సేవలు చేస్తుంది ప్రజల ప్రాణాలు తీస్తుంది…! కేవలం రెండు నెలల్లో 12 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అందులో నేడు 4 ప్రాణాలు తీసింది. 17 మందికి తీవ్రగాయాలు చేసింది. వివారాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నైవేలీ ధర్మల్ పవర్ ప్లాంటు, ఎన్‌ఎల్‌సీ యూనిట్-2లో బాయిలర్ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కార్మికుల్లో 4 అక్కడికక్కడే మృతి చందారు మరో 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. భాదితులని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని రోజులుగా ఆ బాయిలర్ ఉన్న ప్రాంతంలో పనులు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు, ఎందుకంటే గత నెల మే లో కూడా ఆ బాయ్యిలర్ ప్రాంతం లో పేలుడు సంభవించింది ఆ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత రెండు నెలలుగా ఆ బాయిలర్ లో పనులు ప్రారంభించలేదు మరలా తిరిగి బాయిలర్ లో పనులు ప్రారంభించడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్లాంట్ లో చాలా మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ సంస్థ 3,940 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
బాయిలర్ బ్లాస్ట్…! 4 మృతి.. 17 మందికి తీవ్ర గాయాలు..!
-