చాలా మంది శృంగారంలో పాల్గొన్నా కూడా కొంతమంది మాత్రమే అందులో తృప్తి పొందుతున్నారు..ఇలా రెగ్యులర్ గా సెక్సులో పాల్గొన్న జంటలు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.దీని గురించే నిత్యం ఆలోచించి, ఆందోళన చెందకుండా, కామసూత్రంలో వాత్సాయన చెప్పిన భంగిమలను ప్రయత్నిస్తే.. శృంగారంలో స్వర్గపు అంచులను దాకిన అనుభూతిని పొందొచ్చు. ముఖ్యంగా మీరు ఆ కార్యంలో పాల్గొంటున్న సమయంలో మీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ మీ భాగస్వామితో షేర్ చేసుకుని వారి మూడ్ ని మరింత పెంచేయొచ్చు కూడా..
ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్నా లేదా కనీసం వారానికి కనీసం మూడు, నాలుగు సార్లు ఆ కార్యంలో పాల్గొనే జంటలు చాలా హ్యాపీగా ఉంటారట. వీరి చర్మం కూడా మెరిసిపోతూ ఉంటుంది. ముడతలు కూడా తగ్గిపోతాయి.
అంతేకాదు చాలా యవ్వనంగా కనిపిస్తారు. సంతోషంగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో పాటు ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు కూడా చర్మం యవ్వన కాంతితో మెరిసిపోయేందుకు ఎంతో సహాయపడతాయట. అయితే ఈ ఎండార్ఫిన్లు కనీసం వారానికి మూడుసార్లయినా విడుదలైతేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే కొత్త కణాలు పుట్టుకొస్తాయి. వీలైనంత ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి.అప్పుడే శరీరం మంచి ఆరోగ్యం ఉంటుంది..
చాలా మంది ఆఫీసులో కంప్యూటర్ ముందో లేదా ఇంకేదైనా ప్రాంతంలో ఎక్కువగా కూర్చొనే పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంటికొచ్చాక మీ భాగస్వామితో నిలబడి శృంగారంలో పాల్గొంటే మీ హెల్త్ కండిషన్లో చాలా మార్పులు వస్తాయి.నిలబడి చేసే శృంగారం గురించి చాలా మంది ఆలోచించరు. అయితే ఆ కార్యంలో అప్పుడప్పుడు భంగిమలను మార్చడం వల్ల లైంగిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపొచ్చు. మీ భాగస్వామికి ఈ శృంగార భంగిమ లేదా పొజిషన్ ను సూచించండి. అలాగే అద్దం ముందు నిలబడి శృంగారం వంటివి చేయొచ్చు. ఈ భంగిమ వల్ల మీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది..ఇది ఒకసారి ట్రై చెయ్యండి..ఆ ఫీలింగ్ ఎలా వుంటుందో చూడండి..