సడెన్ గా రెడీ అవ్వడానికి డ్రై షాంపూ చేసే మేలు గురించి తెలుసుకోండి..

Join Our Community
follow manalokam on social media

మీ ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళదామన్నారు. అరగంటలో రెడీ అవ్వాలని చెప్పారు. అప్పుడు మీ జుట్టేమో చింపిరి చింపిరిగా ఉంది. పార్టీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి, చివరికి చేసేదేం లేక పార్టీకి వెళ్ళకుండా మానేసారు. జుట్టు చిందర వందరగా ఉందని, ఇప్పుడు స్నానం చేసి జుట్టు ఆరిపోయే దాకా వెయిట్ చేసే సమయం లేదని పార్టీని క్యాన్సిల్ చేసుకున్నవాళ్ళకి డ్రై షాంపూ గురించి తెలిసి ఉండదు. డ్రై షాంపూ వాడితే జుట్టు సెట్ అవుతుందని, అరగంటలో రెడీ అవ్వొచ్చని తెలుసుకోండి.

డ్రై షాంపూ అనేది పౌడర్ లాంటిది. దీన్ని జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల కుదుళ్ళకి పోయి జుట్టుని మృదువుగా చేసి, తాజాగా ఉంచుతుంది. ఐతే దీన్నెలా వాడాలో చూద్దాం.

డ్రై షాంపూని షేక్ చేసి, జుట్టుని సెక్షన్ల మాదిరిగా విడగొట్టి కుదుళ్ళలోకి షాంపూని స్ప్రే చేయాలి. అలా పూర్తయిన తర్వాత దువ్వెనతో దువ్వుకోవాలి. అప్పుడు పౌడర్ లాంటి పదార్థం జుట్టు నుండి పోతుంది.

మీ జుట్టు జిడ్డుగా, చిందర వందరగా కనిపిస్తుంటే డ్రై షాంపూ వాడండి. అయితే మీ షాంపూని ఒకే రోజు రెండవ సారి వాడాలనుకుంటే మాత్రం జుట్టుని నీళ్ళతో శుభ్రపర్చుకోండి.

ఉపయోగాలు

మీ శిరోజాల అందం ఒక రోజు ఎక్కువ రోజులు ఉంటుంది.

అనవసరమైన మలినాలని జుట్టు నుండి పోగొడుతుంది. డ్రై షాంపూతో మర్దన చేసుకుని దువ్వెనతో దువ్వుకుంటే చాలు.

మీ జుట్టు మందంగా కనబడి అందంగా కనిపించేలా చేస్తుంది.

మీ జుట్టు రంగు పోకుండా కాపాడుతుంది. డ్రై షాంపూ వాడితే జుట్టు రంగు పోకుండా ఉంటుంది.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...