మనలో చాలామంది చెట్లను పెంచడాన్ని ఎంతో ఇష్టపడతారు. చెట్లపై ఉన్న ఇష్టం వల్ల ఇంటికి సమీపంలోనే చెట్లను పెంచడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని చెట్లు ఇంటి దగ్గర ఉంటే ఎంత మంచి జరుగుతుందో కొన్ని చెట్లు ఉంటే అంతే దరిద్రం వెంటాడుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జ్యోతిష్కులు కొన్ని చెట్లు ఇంటికి సమీపంలో ఉంటే అదృష్టం వచ్చే చోట కూడా దరిద్రం వెంటాడుతుందని చెబుతున్నారు.
కొన్ని చెట్లు ఇంట్లో ఉండటం వల్ల దుష్ట ప్రభావం పడుతుందని వెల్లడిస్తున్నారు. కొన్ని చెట్ల వల్ల దుష్ప్రభావం కలగకపోయినప్పటికీ ఆ చెట్లు ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదని వెల్లడిస్తున్నారు. ముల్లు ఉన్న చెట్లు, పాలు కారే చెట్లు ఇంటికి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని జ్యోతిష్కులు తెలుపుతున్నారు. ఇంటికి సమీపంలో తుమ్మ చెట్లను, రేగు పండ్ల చెట్లను పెంచకూడదని సూచిస్తున్నారు.
ఈ చెట్లు ఇంటికి సమీపంలో ఉంటే ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ చెట్లు ఇంటికి సమీపంలో ఉన్నవాళ్లు ఏ పనులు చేసినా అనుకూల ఫలితాలను పొందడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ చెట్లు ఇంటికి సమీపంలో ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. తగినంత డబ్బు ఉన్నా వీళ్లు ప్రశాంతతను మాత్రం పొందలేరు. ఈ చెట్లు ఇంటికి ఆవరణలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తూర్పు దిశగా ఎత్తైన చెట్లు లేకుండా జాగ్రత్త పడాలి.