తనను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని
తెరాస బహిష్కృత నేత , ఎమ్మెల్సీ రాములు నాయక్ పేర్కొన్నారు.
తెరాస పార్టీ కి
చెందిన వారు రోడ్డు
ప్రమాదం రూపంలోగాని, మరో ప్లాన్‌తో హతమారుస్తారని ఆరోపించారు.
ఈ సందర్భంగా సోమవారం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను రాములు కలిశారు. పార్టీ
మారినందుకు ఛైర్మన్ జారీ చేసిన నోటీసులపై వివరణ ఇచ్చారు.
పార్టీ మారడంపై
పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు తనకు 4 వారాల గడువు కావాలని కోరానని.. ఛైర్మన్ మాత్రం
అవకాశం ఇవ్వడం లేదన్నారు. తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వచ్చానని.. సోషల్
వర్కర్‌గా గుర్తించి తనను మండలికి పంపించారని గుర్తు చేశారు.
ఏడాది క్రితం నుంచే
తనను టార్గెట్ చేశారన్నారు. తనకు ఏ హాని జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. తనను
ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర జరుగుతోందన్నారు. తనకు
ఏ పార్టీతో సంబంధం లేదన్నారు రాములు నాయక్. రిజర్వేషన్లు పెంచాలని వినతిపత్రం
మాత్రమే ఇచ్చానన్నారు. అధికార పార్టీ తమకు అనుకూలంగా లేని వారిని తీవ్ర ఇబ్బందులకు
గురిచేస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్సీ రాములునాయక్ సంచలన ఆరోపణలు..
-