ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి

-

తెరాస అధినేత కేసీఆర్, ప్రధాని మోదీ తనపై కక్ష పూరితంగానే ఐటీ దాడులు జరిపించారని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. దాదాపు 48 గంటల పాటు రేవంత్ కుటుంబ సభ్యులపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో  నేపథ్యంలో హైదరాబాద్‌లోని నివాసంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటిని తన కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని… 2014లో బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా నిర్మాణానికి రుణాలు తీసుకున్నట్లు  వెల్లడించారు. మలేసియా, సింగపూర్‌లో వ్యాపారాలు చేసినట్లు పేర్కొంటున్నారని మండిపడ్డారు. విదేశాల్లో అకౌంట్ తెరచినట్లు పేర్కొన్న ఏడాది…ఆతర్వాత కూడా తాను ఆయా దేశాలకే వెళ్లలేదన్నారు. కొంత మంది కక్ష పూరితంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కనీస అవగాహ లేకుండా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.

ఆయా దేశాల్లో ఖాతాలు తెరవాలంటే ఆ దేశ పౌరుడై ఉండాలని వివరించారు. 2009, 2014లో తాను ఈసీ ముందు పొందుపరిచిన ఆస్తుల వివరాలు పోల్చి చూడాలని కోరారు. తనకు అండగా ఉన్న కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు అండగా నిలిచిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు అక్టోబర్ 3వ తేదీన మరో సారి విచారణకు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చారన్నారు. అధికారులు అధీనంలోకి తీసుకున్న పత్రాలు, డబ్బుపై వాళ్లనే అడిగి తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news