దేవదాస్ కు కాపీ మరక..!

-

నాగ్, నాని కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజు 7 కోట్ల సుమారు షేర్ రాబట్టిన దేవదాస్ రెండో రోజు 11 కోట్లకు మొత్తం వసూళ్లు చేరింది. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా నాగ్, నానిలను స్క్రీన్ పై చూసి ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

దేవదాస్ సినిమా కథ పాతదే అన్నట్టు అనిపిస్తున్నా ఇది ఓ కాపీ కథ అంటున్నారు కొందరు. మళయాల సినిమా భార్గవచరితం మూనం కాండం సినిమాకు ఫ్రీమేక్ గా దేవదాస్ తీశారని అంటున్నారు. మమ్ముట్టి, శ్రీనివాసం ప్రధాన పాత్రలుగా వచ్చిన ఆ సినిమాలో మమ్ముట్టి డాన్ గా.. శ్రీనివాసం డాక్టర్ గా కనిపిస్తారు.

దాదాపుగా సినిమా లైన్ అదే.. కాకపోతే తెలుగులో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో దేవదాస్ సినిమా చేశారు. దేవదాస్ కాపీ కామెంట్స్ పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news