విజయవాడ కారులో మర్డర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కొరడా విజయ్ కుమార్ మరియు అతని అనుచరులను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో పలు కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. చోడవరం సమీపంలో గార్డెన్ ఫామ్ హౌస్ లో పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ తో విజయ్ కి స్నేహం ఒంగోలులో మొదలైందని విచారణలో తేలింది. రాహుల్ తల్లి ద్వారా ఆయన కుటుంబానికి కి కొరడా దగ్గరయ్యారు.
పుంగనూరు శంకుస్థాపన తో ఇద్దరి మధ్య వివాదం ముదిరినట్టు తెలుస్తోంది. దాంతో గాయత్రి అనే మహిళ రాహుల్ కు ఫోన్ చేసి పిలిపించింది. విజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు కలిసి రాహుల్ ను హత్య చేశారు. బీహార్ కు చెందిన ఫ్యాక్టరీ వాచ్ మెన్ ఈ కేసులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కొంగటి సత్యం పాత్ర ఎంత ఉన్నది అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. విచారణ అనంతరం ఈ రోజు మధ్యాహ్నం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.