రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎం సొంత అజెండాతో పని చేయవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పనుల నిమిత్తం సిఎంని కలిస్తే దానికి చెడు ఉద్దేశ్యాలు అపాదించవద్దుని, పనుల నిమిత్తం ఏ రాజకీయ పార్టీ నేతలైనా ముఖ్యమంత్రిని కలిసే కల్చర్ రావాలని ఎంపీ ఈటెల రాజేందర్ ఆకాంక్షించారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో రాజేందర్ మాట్లాడుతూ… ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం పని చేయాలని సూచించారు. తాను అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిత్యం కొట్లాడేవాడిని అలా నలుగురు సీఎంలతో కొట్లాడాను. సభలో కొట్లాడాక ఆ వెంటనే దరఖాస్తు పట్టుకుని సీఎంల వద్దకు వెళ్లేవాడినని తెలిపారు. తనను చూసిన ముఖ్యమంత్రిలు ఇప్పటి వరకు సభ జరగనివ్వని నేకెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించేవారని కానీ సీఎం పదవి అంటే పార్టీ కాదని అది ప్రజలు ఇచ్చిన పదవి అని తాను చెప్పెవాడినని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు పట్టుబడ్డి మరీ తనను గెలిపించుకున్నారని ఈ విజయం మల్కాజిగిరి ప్రజలకు అంకితం అని అన్నారు. అని అన్నారు.ఏ సమస్యకైనా నో అనేది నా డిక్షనరీలోనే లేదని ప్రతి సమస్యకు ఎక్కడో ఓ చోట పరిష్కార మార్గం ఉంటుందని నమ్మే వ్యక్తిని తాను అని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు.