క‌రోనాతో నిర్మాత సి.ఎన్‌.రావు మృతి.. విషాదంలో టాలీవుడ్‌

-

కరోనా వైరస్ చాలా ప్ర‌మాద‌క‌రంగా త‌యార‌వుతోంది. సెకండ్ వేవ్ ఎలా త‌యారందో మ‌నం చ‌స్తూనే ఉన్నాం. రోజుకు మూడు లక్షల దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయంటే ప‌రిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ వైర‌స్ త‌న పంజాను టాలీవుడ్ పై విసురుతోంది. ఇప్పటికే ఎంతోమంది నటీన‌టుల‌ను, గాయ‌కుల‌ను బ‌లి తీసుకుంది.


ఇప్పుడు తాజాగా ఓ నిర్మాత‌ను త‌న ఖాతాలో వేసుకుంది. సినీ నిర్మాత సి.ఎన్.రావు క‌రోనాతో తుది శ్వాస విడిచారు. సి.ఎన్.రావు అలియాస్ చిట్టి నాగేశ్వరరావు తెలుగులో అనేక సినిమాలు తీశారు. మా సిరిమల్లె, అమ్మానాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ లాంటి సినిమాలే కాకుండా అటు తమిళంలో ఊరగా వంటి మూవీల‌తో త‌న మార్కు చూపించారు.
ఇప్పుడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, ఆలాగే తెలుగు సినిమా బిజినెస్ మండ‌లి కార్యవర్గ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఇక నిర్మాత సి.ఎన్.రావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నింపుకుంది. ఆయ‌న ఈ మ‌ధ్య మ‌రో రెండు చిన్న సినిమాల‌ను నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా క‌రోనా సోకింద‌ని తెలుస్తోంది. వెంట‌నే హాస్పిట‌ల్ లో చేరిన ఆయ‌న‌.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు విష‌మంగా మార‌డంతో చ‌నిపోయార‌ని తెలుస్తోంది. కాగా ఇప్పటికే పలు టాలీవుడ్ ప్రముఖులకు కరోనా సోక‌డంతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ పాడు మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌హామ‌హులు క‌న్ను మూస్తున్నారు. ఇప్ప‌టికైనా దీని యుద్ధాన్ని మ‌న మీద ఆపాలిన కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news