కరోనా సెకండ్ వేవ్: డబుల్ మాస్క్ పెట్టుకుంటేనే సేఫ్.. ఎలాగంటే..?

-

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఈ మేరకు కరోనా నిబంధనలను కూడా కఠినతరం చేసింది. బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగకుండా ఉండాలని, ప్రతి పది నిమిషాలకు శానిటైజర్‌తో తమ చేతులకు శుభ్రం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో డబుల్ మాస్క్ వేసుకోవాలని, దీంతో మరింత రెట్టింపు రక్షణ దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డబుల్ మాస్క్
డబుల్ మాస్క్

డబుల్ మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ పొందుతాము. వైరస్ సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. డబుల్ మాస్క్ ధరించడం వల్ల 96.4 శాతం కరోనా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లఢించారు. సాధారణంగా డబుల్ మాస్క్ అంటే.. ఒక వ్యక్తి ఒకేసారి రెండు మాస్కులను ధరించడం. డబుల్ మాస్క్ వేసుకోవడం ద్వారా గాలిలో ఉండే వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.

రద్దీగా ఉండే ప్రాంతాలు.. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, పార్కులు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో డబుల్ మాస్క్ ధరించాలి. మాస్కులను ప్రతిరోజు వేడి నీటితో శుభ్రంగా కడగాలి. మాస్కులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎన్-95 మాస్కులు తీసుకోవడం ఉత్తమం. వాడిన మాస్కులనే వాడకుండా.. కొద్ది రోజులకు కొత్త మాస్కులను కొనుగోలు చేయాలి. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news