చిరుతని పద్మవిభూషణ్‌తో సత్కరించారు – ఉపాసన

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. గతంలో పద్మ భూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నాడు. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభీషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో….చిరంజీవికి అభినందనలు తెలుపుతూ కంగ్రాట్స్ మామయ్య అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ”ఐదు బలమైన వేళ్ళు కలిస్తేనే బలమైన పిడికిలి అవుతుంది. మా అందరికి అయన మూవీలోనే కాదు దాతృత్వంలో కూడా. కానీ జీవితంలో నాన్నగా, మామయ్యగా, తాతయ్యగా ఉంటారు. చిరుతని పద్మవిభూషణ్ తో సత్కరించారు” అంటూ ఉపాస‌న ట్విట్టర్(ఎక్స్) లో పోస్ట్ చేసింది. దీనితో పాటు ఒక ఫోటోను షేర్ చేయగ, అందులో చిరంజీవి త‌న మనవరాల్లు,రామ్ చరణ్ కూతురు క్లింకార,సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల పిల్ల‌ల‌తో ఉంది. కాగా ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version