టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై.. ఆరెంజ్‌ ఆర్మీ ఆశలు నేరవేరేనా..

ఐపీఎల్‌ సీజన్ 2022 దగ్గర పడుతున్న కొద్దీ జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. అయితే.. ఇప్పటికే ప్లే ఆప్‌ ఆశలు విడిచిన ముంబై జట్టు.. ఆ మ్యాచ్‌పైనే ప్లే ఆఫ్‌ ఆశలు పెట్టుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈ రోజు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. 5 ఓటములు చవి చూసిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

MI vs SRH: Sunrisers Hyderabad's Predicted Playing XI Against Mumbai Indians, IPL 2022 Match 65

సన్‌రైజర్స్ సారధి విలియమ్సన్ పేలవ ఫామ్.. ఆ జట్టుకు ప్రతిబంధకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అయినా అతను మెరుగైన ఆటతీరు కనబరుస్తాడని సన్‌రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు. హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ ఆడటం లేదని, వారి స్థానాల్లో మయాక్ మార్కండే, సంజయ్ యాదవ్ ఆడుతున్నారని వెల్లడించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ప్రియమ్ గర్గ్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజల్లాక్ ఫరూఖీ

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ యాదవ్, టిమ్ డేవిడ్, డానియల్ శామ్స్, రమణ్‌దీప్ సింగ్, సంజయ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, రైలీ మెరెడిత్