తాలిబ‌న్ల‌పై పోస్టులు..కంగ‌నా ఇన్స్టా అకౌంట్ హ్యాక్.. !

-

ఇప్ప‌టికే కంగనా ర‌నౌత్ కు చెందిన ట్విట్ట‌ర్ ఖాతాను ట్విట్ట‌ర్ బ్లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. కంగ‌నా ర‌నౌత్ ట్విట్ట‌ర్ లో రైతు ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా పోస్ట్ లు పెట్ట‌డం..రెచ్చ‌గొట్టే విధంగా కంగ‌నా పోస్ట్ లు ఉండ‌టంతో ట్విట్ట‌ర్ ఆమె ఖాతాను పూర్తిగా తొల‌గించింది. దాంతో కంగ‌నా ర‌నౌత్ ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ లు పెట్ట‌డం ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఇన్స్ట్రాగ్రామ్ లో కూడా కంగానా కు బిగ్ షాక్ త‌గిలింది. ఫైర్ బ్రాండ్ ఇన్స్ట్రా గ్రామ్ ఖాతా హ్యాక్ కు గురైంది.

ఈ విష‌యాన్ని కంగ‌నా స్ప‌ష్టం చేసింది. తాను ఆఫ్గ‌నిస్తాన్ తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టాన‌ని అందువ‌ల్లే త‌న అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని తెలిపింది. అంతే కాకుండా త‌న అకౌంట్ చైనా నుండి హ్యాక్ అయింద‌ని పేర్కొంది. ఇది ఓ కుట్ర అంటూ కంగనా వ్యాఖ్యానించింది. తాను ఇన్స్టా గ్రామ్ కు ఫిర్యాదు చేసాన‌ని త‌న అకౌంట్ తిరిగి వ‌చ్చింద‌ని కానీ పోస్టులు పెడుతుంటే లాగ్ అవుట్ అవుతుంద‌ని పేర్కొంది. దాంతో త‌న సోద‌రి ఇన్స్టా నుండి ఈ స్టోరీ పెడుతున్నాన‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news