తెలంగాణలో కొలువుల జాతర షురూ..

-

తెలంగాణలో 9355 పంచాయతీ కార్యదర్శుల నియామక నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చుస్తున్న కొలువుల భర్తీ కోసం ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గురువారం సాయంత్రం పంచాయతీరాజ్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లా కేడర్ పోస్టులుగానే వీటిని పరిగణిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  కార్యదర్శుల ఎంపిక కోసం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధ్యక్షతన గతంలోనే ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాత పరీక్ష ఆధారంగా పోస్టుల భర్తీ చేయనున్నారు.

ముఖ్య తేదీలు..

దరఖాస్తుల స్వీకరణ :  సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి

ఫీ చివరి తేది:  జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 , ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు రుసుం సెప్టెంబర్ 10 వరకు చెల్లించవచ్చు

ఎంపిక విధానం:   రాత పరీక్ష ద్వారా ఎంపిక నిర్వహిస్తారు

విద్యార్హత:   ఏదైన డిగ్రీ చేసిన వారు అర్హులు

వయోపరిమితి:   18 నుంచి 39 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ.. ఇతర కేటగిరీల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

సబ్జెక్:   జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ, కొత్త పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ధి, భౌగోళిక,ఆర్థిక, తెలంగాణ చరిత్ర, సంస్కృతి సబ్జెక్ లలో అభ్యర్థిని పరీక్షిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news