దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో దొంగ ఓట్లను చేర్చి,టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు.ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు.పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను ఎక్కువగా చేర్చుతున్నారని తెలిపాడు. చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశాన్ని కేస్ స్టడీగా తీసుకోవాలని ఈసీకి ఆయన విజ్ఞప్తి చేశారు . చంద్రగిరిలో 28 వేల ఓట్లను కొత్తగా చేర్చారని.. అందులో 13 వేలకు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయని తెలిపారు.చిత్తూరు జిల్లాలో భూకబ్జాలు, దౌర్జన్యాలు చేసి ఆ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
గత తిరుపతి ఉపఎన్నికల విషయంలో కూడా ఈసీ సీరియస్‌గా రియాక్టు అయ్యిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికలకి భిన్నంగా దొంగ ఓట్లపై వైసీపీ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. ఈసీ సీరియస్‌గా ఉండటంతో ఇప్పుడు పోలీసుల్లో భయం వచ్చిందన్నారు చంద్ర బాబు.