నాటి సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కుమార్ ఢిల్లీ హైకోర్టును గురువారం ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల ఎదుట తాను లొంగిపోయేందుకు మరో నెల రోజుల సమయం కావాలని తన పిటీషన్ లో పేర్కొన్నారు. 1984 ఘర్షణల్లో అనేక మంది సిక్కులను ఊచకోత కోసిన కేసులో సజ్జన్‌కుమార్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్దారించి ఇటీవలే ఆయనకు జీవిత ఖైదును విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 31 లోగా పోలీసులకు లొంగిపోవాలని సజ్జన్ కుమార్ ని న్యాయస్థానం ఆదేశించింది. తనకు ముగ్గురు పిల్లలు, ఎనిమిది మంది మనుమలు, మనవరాళ్లు ఉన్నారని, తనకు సంబంధించిన ఆస్తులను వారికి అప్పగించాల్సిన అవసరం ఉందని, అందుకు జనవరి 31 వరకు గడువునివ్వాలని కోర్టును కోరారు. పిటీషన్ పై శుక్రవారం విచారించనున్నట్లు సమాచారం.