కె.టి.ఆర్ తో ఎన్.టి.ఆర్.. సోషల్ మీడియాలో వైరల్..!

కె.టి.ఆర్, ఎన్.టి.ఆర్ కలిసి దిగిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తుంది. అది ఇప్పటిదా కాదా అన్నది తెలియదు కాని దాదాపు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ఈ పిక్ హాట్ న్యూస్ గా మారింది. ఇద్దరు తారక రాముళ్లు ఒక చోట చేరి ఏం మాట్లాడుకున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ అయ్యింది. ఈమధ్యనే తెలంగాణాలో టి.ఆర్.ఎస్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అందులో యాక్టివ్ ప్రెసిడెంట్ గా కె.టి.ఆర్ ను ఎన్నుకున్నారు. మరి ఈ టైంలో కె.టి.ఆర్, ఎన్.టి.ఆర్ కలవడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఓ పక్క టిడిపి తరపున అక్క సుహాసిని నిలబడినా సరే ఎన్.టి.ఆర్ ఈసారి ఎలక్షన్స్ కాంపెయినింగ్ లో పాల్గొనలేదు. హరికృష్ణ మరణం తర్వాత టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అంతిమ సన్స్కారం ఘనంగా నిర్వహించారన్న కృతజ్ఞతతో ఎన్.టి.ఆర్ వారికి వ్యతిరేకంగా ప్రచారానికి ఒప్పుకోలేదు.

ఇదిలాఉంటే కె.టి.ఆర్, ఎన్.టి.ఆర్ సడెన్ గా కలిశారా లేక కావాలని కలిశారా అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్, రాజకీయాల్లో యువ నాయకుడిగా ఉన్న కె.టి.ఆర్ మీటింగ్ కచ్చితంగా సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.