హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పెట్రో ధరలు పెంపు నకు కారణం సిఎం కెసిఆర్ అంటూ పేర్కొన్నారు కిషన్ రెడ్డి. పెట్రో ధరలు పెంపునకు ప్రపంచ క్రూడాయిల్ ధరలు కారణమని.. ఈ నిర్ణయం తీసుకుంది మన్మోహన్ సింగ్ అని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కెసిఆర్ మంత్రిగా పని చేశారని.. ధరల పెరుగుదల నిర్ణయానికి కారణం కెసిఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
కెసిఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ఎన్నికలే సమాధానమన్నారు. ఈటెల అవినీతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని.. టిఆర్ఎస్ పార్టీ కి చరమ గీతం పాడాలని.. దానికి ఈ ఎన్నికలే తొలి అడుగు అన్నారు. దళిత బందు ఆపింది టిఆర్ఎస్ పార్టీ అని.. దళితుల ను మోసం చేయడమే కెసిఆర్ నైజామని విమర్శించారు.
దళిత బందు అపి మొండి చేయి చూపించారని.. ప్రజలను మోసం చేయడమే కెసిఆర్ నైజామన్నారు. దళిత బందు ఆపాలని మేము ఫిర్యాదు చేయలేదని.. దళిత బందు రాష్ట్ర మంతా అమలు చేయాలని తాము చెప్పమని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి. మనకు ఫామ్ హౌస్ పాలన కావాలా…? సంక్షేమ పాలన కావాలా…? అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా…? అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టారన్నారు.