“‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” డిలీట్ సీన్ ఔట్… షర్ట్ విప్పి రెచ్చిపోయిన అఖిల్!

అక్కినేని హీరో అఖిల్ మరియు యు.పి జా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జి ఎ 2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను బన్నీవాసు మరియు వాసువర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

అయితే విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా నడుస్తుంది. రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో డిలీట్ చేసిన పెళ్లిచూపులు సీన్ ను వదిలింది చిత్ర బృందం. ఇక ఈ డిలీట్ చేసిన వీడియోలో… అక్కినేని అఖిల్… తన యాక్టింగ్ అదరగొట్టాడు. పెళ్లి చూపుల కోసం వెళ్లి… అమ్మాయి ముందు షర్ట్ విప్పి.. రచ్చ చేస్తాడు. అయితే ఈ సీన్ ను సినిమాలో మొదట పెట్టాలని అనుకున్న చిత్రబృందం… కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసింది. అయితే తాజాగా ఆ డిలీట్ చేసిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది గీతాఆర్ట్స్.