నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రణయ్ కుటుంబ సభ్యులు, భార్య అమృత వర్షిణి విగ్రహాన్ని సాగర్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుస్తున్నారు.. ఈ నేపథ్యంలో చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్ విగ్రహ నిర్మాణాన్నిఆపాలని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్‌పై హైకోర్టు జస్టిస్ ఏవీ. శేషసాయి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ సీఐ, మున్సిపల్ కమిషనర్లను 23వ తేదీన కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది.
ప్రణయ్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే
-
Previous article
Next article