ఫేక్.. ఫేక్.. ఫేక్.. సోషల్ మీడియాలో షేర్ అయ్యే పోస్టుల్లో 90 శాతం ఫేకే ఉంటాయట. అందుకే.. జనాలు దేన్ని నమ్మాలో.. దేన్ని నమ్మకూడదో తెలియక సతమతమవుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో ఈ నకిలీ పోస్టుల గొడవ ఎక్కువ. అయితే.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టును రిపోర్ట్ చేయడం, బ్లాక్ చేయడం, దానిపై ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లాంటి ఫీచర్లు ఉంటాయి.
మరి.. వాట్సప్ లో? వాట్సప్ లో వచ్చిన నకిలీ పోస్టులపై ఎలా ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియదు. కానీ.. వాట్సప్ యాప్ లోనూ ఫిర్యాదుకు సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. వాట్సప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి.. హెల్ప్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కాంటాక్ట్ అజ్ (contact us) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి కంప్లయింట్ ఫైల్ చేయొచ్చు.
లేదంటే మరో విధంగానూ వాట్సప్ కు ఫిర్యాదు చేయొచ్చు. ఇండియాకు సపరేట్ గా కంప్లయింట్ కోసం ప్రత్యేక అధికారిని నియమించింది వాట్సప్. సీనియర్ డైరెక్టర్ కోమల్ లాహిరిని భారత్ కు ఫిర్యాదుల విభాగానికి అటాచ్ చేశారు. ఆమెకు పొస్ట్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే కోమల్ లాహిరి, వాట్సప్ ఇన్, అటెన్షన్: గ్రీవెన్స్ ఆఫీసర్, 1601 విల్లో రోడ్, మెన్లో పార్క్, కాలిఫోర్నియా 94025, యూఎస్ కు ఫిర్యాదు కాపీని పంపించవచ్చు.