రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పార్టీనుండి వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ తనపై ఏ విధంగా దాడి చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నాకు డబ్బే అవసరం అయితే రాజకీయాల్లోకి వచ్చే అవసరమే లేదు.. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. ప్రస్తుతం నేను రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అసలు నాగురించి పట్టించుకునే వారే లేకపోయేవారు. అయితే నా స్వార్ధం కోసం రాజకీయ బాట పట్టలేదు. సమాజంపై ప్రేమతో.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగిందని బాధపడ్డారు. నా సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు ఏపీలో నాపై కక్షతో ఆపేసి ప్రయత్నం చేశారు.
దాని వలన నాకు రూ. 30 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అయిన ఆ నష్టాన్ని నేను భరించి ప్రజల కోసమే వైసీపీకి వ్యతిరేకంగా వారు చేసిన అన్యాయాలను ఎదిరిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.