టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి …తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి అంగీకరించిన రేవంత్ రెడ్డి ప్రజలు తనకు మరింత బాధ్యతను పెంచారన్నారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా.. ప్రజల మధ్య ఉండే వారి సమస్యలపై పోరాడుతానన్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే పొంగిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం కాదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వ్యవహారి శైలిని మార్చుకొని.. ఫామ్‌హౌస్ నుంచి కాకుండా.. ప్రజల మధ్య ఉండి పాలన చేయాలని సూచించారు. తక్షణమే తెలంగాణ అమరవీరులను గుర్తించి ఆదుకోవాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా, విద్యార్థులకు మంచి విద్యను అందించేలా పాలన చేయాలని సూచించారు.