సింగరేణి కాలనీ కేసు అప్డేట్..రంగం లోకి వెయ్యిమంది పోలీసులు..!

సింగరేణి కాలనీ ఘటన కేస్ లో నిందితుడు రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. మొత్తం 70 టీమ్స్ గా పోలీసులు ఏర్పడ్డారు. అలాగే నిందితుడి కోసం వెయ్యి మంది పోలీసులు రంగం లో కి దిగారు. రాజు సెల్ ఫోన్ వాడడు అని తెలుస్తోంది. దీoతో రాజు ఆచూకీ గుర్తించడం ఆలస్యం అవుతోంది. ఈ కేసులో కీలకంగా సీసీ కెమెరాల విజువల్స్ కీలకంగా మారాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఆనవాలు దొరకకుండా రాజు అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. తల కు ఎర్రటి టవల్ కట్టుకుని రాజు జుట్టు ను కవర్ చేస్తున్నారు. చిన్ వద్ద గడ్డం కనిపించకుండా మాస్క్ తో కవర్ చేశాడు. టాస్క్ ఫోర్స్ డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపులు కొనసాగుతున్నారు. ఇప్పటికే రాజు ఆచూకీ పై పోలీస్ శాఖ 10 లక్షల రివార్డ్ ప్రకటించింది.