సీఎం అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉంది… సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తనతో పాటు సీఎం అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజమైన పోరాట యోధుడు అని ప్రశంసల వర్షం కురిపించారు.తెలంగాణ కోసం తెగించి, సొంత పార్టీ ఎదురించి పోరాటం చేశారని.. కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని అన్నారు.మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని,తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ హైకమాండ్‌ను ఒప్పించారని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను రేవంత్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకే వెళ్తుందని అన్నారు .మోడీతో, బీజేపీతో కేసీఆర్‌ ఏనాడూ పోరాటం చేయలేదని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news