హైద‌రాబాద్ లో యువ‌తి మిస్సింగ్..గుడికి వెళ్లి.!

గుడికివెళ్లి వ‌స్తాన‌ని చెప్పి ఇంటి నుండి వెళ్లిన ఓ యువ‌తి అదృష్యం అయ్యింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది. హైద‌రాబాద్ లోని లాలా గూడ ఎస్సై ర‌వీంద‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…నార్త్ లాలా గూడ శాంతి న‌గ‌ర్ కు చెందిన పి.శార‌త కుమార్తె పి.క‌ల్ప‌ల‌త 24 డిగ్రీ చ‌దువుతోంది. గ‌త నెల క‌ల్ప‌ల‌త గుడికి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్లింది.

girl missing in hyderabad
girl missing in hyderabad

దాంతో కుంటంబ సభ్యులు గుడి ప‌రిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ ల‌భించ‌లేదు. బంధువుల‌కు స్నేహితుల‌కు ఫోన్ లు చేసినా క‌ల్ప‌ల‌త ఆచూకీ లభ్యం అవ్వ‌లేదు. దాంతో ఆందోళ‌న చెందిన కుంటుబ స‌భ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.