ఈడీ విచారణకు హాజరైన నటి ‘రకుల్‌’

ఈడి కార్యాలయానికి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ చేరుకున్నాడు. ఇవాళ ఉదయం 10:30 కి ఈడి కార్యాలయానికి రావాల్సిందిగా రకుల్ కు నోటీసులు జారీ చేయగా.. ఈడి అధికారుల కంటే ముందే ఆ కార్యాలయానికి చేరుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఉదయం 9:10 కి ఈడి కార్యాలయానికి చేరుకుంది రకుల్. రకుల్ తో పాటు ఒక న్యాయవాది, మేనేజర్, సిఎ కూడా పాల్గొన్నారు.

ఆరెంజ్ కలర్ ఫైల్ చేత్తో పట్టుకుని ఈడి ఆఫీస్ కు వచ్చిన రకుల్… తనకు చెందిన పలు బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్ ను తీసుకొచ్చింది. అయితే.. కాసేపటి క్రితమే డ్రగ్స్ కేసు లో రకుల్ విచారణ కూడా ప్రారంభం అయింది. 2016 లో f క్లబ్ లో పార్టీ కి హజరైంది రకుల్.. అయితే అదే పార్టీ లో చాలా మందికి డ్రగ్స్ సప్లై చేసిన కెల్విన్…రకుల్‌ కు కూడా సప్లయి చేసినట్లు తెలుస్తోంది. ఈ f క్లబ్ పార్టీ కి రకుల్ తో పాటు, రానా దగ్గుపాటి కూడా హజరయ్యారని సమాచారం. f క్లబ్ పార్టీ పైనే ఈడీ అధికారులు… రకుల్‌ ను ప్రశ్నిస్తున్నారు.