ఆ డైరెక్టర్ నాకొక హిట్ సినిమా ఇచ్చాడు. ఇక దాని తర్వాత మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాం. ఆ మధ్య ఫోన్ చేసి ఓ కథ చెప్తా కలుద్దాం అన్నాడు. వద్దంటే బాగోదు కదా అని ఓకే చెప్పా. కానీ ఏ కథ చెప్పినా నో చెప్పాలని ముందే ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఏదో మొహమాటం కొద్ది వింటా అని చెప్పా. కానీ ఆ డైరెక్టర్ చెప్పిన కథ విన్నాక ఓకే చెప్పకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే కథ అలా ఉంది మరి అంటూ చెప్పుకొచ్చాడు నాచురల్ స్టార్ నాని.
ఇంతకీ ఆయన చెప్పింది ఎవరి గురించి, ఆ కథ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ముందుకుపదండి.
నాని సినిమా కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో నిన్ను కోరి ఒకటి అనడంలో సందేహమే లేదు. ఆ సినిమాలో నాని తన నటనతో అమ్మాయిల మనససు దోచేశాడు. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా నటించి మెప్పించాడు. ఆ స్థాయి నటన ఎవరూ చూపించలేరంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటూ ముందుగానాని నటన గురించే చెప్పాలి. ఎందుకంటే నాని పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది మరి.
ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసిన శివ నిర్వానతో ప్రస్తుతం టక్ జగదీశ్ మూవీ చేస్తున్నాడు నాని. ఈ కథ చెప్పేందుకు కలుస్తానంటే ముందు ఒప్పుకోలేదని, కానీ కథ విన్నాక ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు నాని. ఈ విషయాలను తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అయితే ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి అయింది. రిలీజైన్ పోస్టర్లు, టీజర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. కొవిడ్ ఎఫెక్ట్ తగ్గాక మూవీని రిలీజ్ చేస్తామని నాని తెలిపాడు.