ఇండియా కూటమి సంచలన నిర్ణయం….. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే…..

-

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికలలో గెలిచేందుకు ఇప్పటి నుండే పావులు కదుపుతుంది. ఇటీవల ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగియడంతో పొలిటికల్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇండియా కూటమి వచ్చి ఎన్నికలలో కమలం పార్టీని గద్దె దింపడం లక్ష్యంగా పావులు కదుపుతు ఈరోజు మరోసారి భేటి అయ్యారు.ఈ కార్యక్రమానికిమాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఖర్గే,సోనియా గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్,టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ తదితర నేతలు సమావేశం అయ్యారు.

Pm ఎవరు అనేదానిపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో… పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ముఖ్య ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అయితే బాగుంటుందని మమతా బెనర్జీ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై పలువురు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కూటమిలోని ఎక్కువ శాతం సభ్యులు ప్రధాని ఎవరనేది ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్ణయించుదామని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా… ప్రధాని అభ్యర్థిగా ఖర్గే ను మమతా బెనర్జీ ప్రకటించడం ఎలక్షన్ సమయంలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news