20 ఏళ్ల తరువాత.. ఢిల్లీలో కేసీఆర్ అధికార నివాసం నేమ్ ప్లేట్ మార్పు..!

-

ఢిల్లీ తుగ్లక్ రోడ్డు నివాసం వద్ద కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ ను అధికారులు మార్చారు. గత 20 ఏళ్లుగా తుగ్లక్ రోడ్డులోని 23వ నంబర్ బంగ్లా కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఆ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన వ్యక్తిగత వస్తువులను సిబ్బంది వేరే చోటుకి తరలించారు. 2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి కేసీఆర్ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ తొలి వారం వరకు అదే బంగ్లా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది.


ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సిబ్బంది బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు. తుగ్లక్ రోడ్డులోని బంగ్లా దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది. సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత మంగళవారం తొలిసారిగా ఈ బంగ్లాను రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎంఎస్ ఫ్లాట్స్ యమున అపార్ట్ మెంట్ లో 902 ఫ్లాట్ ప్రస్తుతం నివాసం గా ఉంది. త్వరలో ఆయన ఆ ఫ్లాట్ ను కాళీ చేయనున్నట్టు సమాచారం. తుగ్లక్ రోడ్డు బంగ్లాలో మార్పులు చేర్పుల తర్వాత పూజ చేసి అధికారికంగా బంగ్లాను వినియోగించుకోవాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news