ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. జనవరి 29న పోలింగ్

-

రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. పోలింగ్ కూడా అదే పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఈ రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనుండటంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ వశమయ్యే అవకాశం ఉంది.

మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7. సీపీఐకి 1 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం వల్ల మెజార్టీ సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ గెలుచకుంటుంది. ఈ ఎమ్మెల్సీల పదవీ కాలం నవంబర్ 30, 2027 వరకు ఉంటుంది.అసెంబ్లీ కార్యాలయం ఇవాళ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడంతో ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 19న పరిశీలన, 22వ తేదీలోపు ఉపసంహరణలకు గడువు , 29వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేసి విజేతలను నిర్ణయిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version