Naa Saami Ranga : నా సామిరంగ నుంచి ‘ఇంకా ఇంకా దూరమే’ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

-

విజయ్‌ బన్నీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ’.పూర్తిస్థాయి మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘నా సామిరంగ’ వస్తోంది.ఆషికా రంగనాథ్‌ కథానాయికగా న‌టిస్తుంది .విజయ్‌ బన్నీ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అల్ల‌రి న‌రేష్, రాజ్ త‌రుణ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌తో పాటు పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వ‌చ్చింది.

 

ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ‘ఇంకా ఇంకా దూరమే’ అంటూ సాగే ఎమోష‌న‌ల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే.. ఇంకా ఇంకా ప్రాణ‌మే ద‌గ్గ‌ర‌వుతుంటే.. అంటూ ఎమోష‌న‌ల్‌గా ఈ సాంగ్ సాగింది. ఇక ఈ పాట‌ను సత్య యామిని,మమన్ కుమార్ క‌లిసి ఆల‌పించ‌గా.. ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఎం ఎం కీరవాణి సాహిత్యంతో పాటు సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version