ఏపీలో మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎప్పటి లానే ఈరోజు కూడా కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి. తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 76 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 476506కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4276 మంది మరణించారు.
ఇక ఏపీలో ఇప్పటివరకు 370163 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 102067 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లోనే 12,334 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. కాగా నిన్న ఒక్క రోజే 59,919 పరీక్షలు చేయగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39,65,694 టెస్టులు చేశారు.