ఈ రోజు చెన్నై మరియు లక్నో జట్ల మధ్యన జరగాల్సిన మ్యాచ్ కాస్తా వర్షం కారణంగా అర్దాంతరంగా ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే మ్యాచ్ ఆగిపోయింది. ఈ మ్యాచ్ లో రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య కెప్టెన్ గా బాధ్యతలను తీసుకున్నాడు. అయితే కృనాల్ పూర్తి స్థాయి కెప్టెన్ గా చేసిన మొదటి మ్యాచ్ లోనే డక్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీనితో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు, జట్టు కష్టాల్లో ఉన్న సమయములో క్రీజులోకి వచ్చి బాధ్యత లేకుండా అవుట్ అయ్యాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇలా కెప్టెన్ గా ఆడిన తొలి మ్యాచ్ లోనే డక్ అవుట్ అవ్వడం కృనాల్ పాండ్య మూడవ వాడు కావడం గమనార్హం.
ఇంతకు ముందు లక్ష్మణ్ 2008 లో డెక్కన్ ఛార్జెర్స్ కు కెప్టెన్ గా చేసిన మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. ఇక ఈ సీజన్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా మార్కురామ్ ఆడిన తొలి మ్యాచ్ లోనే డక్ అవుట్ అయ్యాడు.