కాంగ్రెస్ లో కమిటీల లొల్లి షురూ…

-

కాంగ్రెస్ గెలవదు..కొమటిరెడ్డి

 

తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల లొల్లి షురూ అయింది. కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను నియమించి 24 గంటలు కూడా కాకముందే అసమ్మతి సెగలు రేగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ బ్రదర్స్ లో కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పెద్దలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…  కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ప్రకటించిన నియామకాలను తప్పుబడుతూ.. అధిష్టానం పెద్దలపై నిప్పులు చెరిగారు. పార్టీకి కుంతియా శనిలా దాపురించారంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కమిటీల్లో బ్రోకర్లకు స్థానం కల్పించారని.. కనీసం వార్డు మెంబర్లుగా కూడా గెలవని వారికి కమిటీల్లో చేర్చడమేంటని నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. కొందరు చేసిన తప్పులతో అధికారంలోకి రాలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థతి మరో సారి కొనసాగే విధంగా ఉందని ఆయన జోష్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కోసం అన్నదమ్ములమిద్దరం  మా సర్వం ధారపోస్తే…తమను రెండున్నరేళ్లు పక్కన పెట్టారని మండిపడ్డారు కోమటిరెడ్డి. తమను అడుగడునా అవమానించారని.. పార్టీ కోసం కష్టపడితే విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. ప్రజల కోసమే బతుకుతున్నామని.. తమని కూడా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పైరవీ కార్లను పక్కన పెట్టి.. పార్టీ కోసం పనిచేసేవారికి టిక్కెట్లు ఇస్తేనే పార్టీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర చర్చకొనసాగుతుంది. ఎప్పటినుంచో కోమటిరెడ్డి బ్రదర్స్ కారు ఎక్కెందుకు సిద్ధంగా ఉన్నారని గుసగుసలు విన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news