కాశ్మీర్ వీధుల్లో భీభత్సం సృష్టించిన లారీ,వైరల్ అవుతున్న వీడియో

-

జమ్మూ కాశ్మీర్ లోని సాంబా లో ఉల్లి లోడుతో వెళుతున్న లారీ ఒకటి భీభత్సం సృష్టించింది. దీనికి సంబందించిన దృశ్యాలు అక్కడ దగ్గర లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా లో లారీ ఉల్లి లోడుతో వెళుతుంది. అయితే ఆ ఇరుకు వీధుల్లో వేగంగా ప్రయాణిస్తూ వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా స్లో గా వెళుతున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. దీనితో అంత లోడుతో ఉన్న లారీ పల్టీ కొట్టుకుంటూ కొంతదూరం ఈడ్చుకు పోయింది. అయితే ఈ ప్రమాదంలో కారు తో పాటు ఎదురుగా వస్తున్న బైక్ ను కూడా ఢీకోట్టినట్లు తెలుస్తుంది. దీనితో ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన అంతా కూడా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ గా మారింది.

l

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వీడియో లో లారీ వచ్చిన వేగం చూస్తే మాత్రం ఒళ్లు గగ్గురుపొడవక మానదు. అక్కడ ఉన్న జనాలు అంతా ఆ ఘటన చూసి ఒక్కసారిగా షాక్ కు గురై సంఘటనా స్థలం నుంచి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news