కెనడా ఓపెన్ 2023: క్వార్టర్స్ లోకి సింధు & లక్ష్యసేన్ !

-

ఇండియా స్టార్ షటిల్ ప్లేయర్ లు అయిన పీవీ సింధు మరియు లక్ష్య సేన్ లు ప్రస్తతం కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ లో తమ సత్తా చాటుతుంన్నారు. వీరిద్దరూ తమ విభాగాల్లో క్వార్టర్స్ కు చేరుకున్నారు. ముందుగా మహిళల విభాగంలో పీవీ సింధు ప్రీ క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన నట్సుకి నీదైర తో ఆడాల్సి ఉంది. కానీ నీదైరా గాయం కారణంగా గేమ్ నుండి తప్పుకోవడంతో, శ్రమించకుండానే పీవీ సింధు ప్రీ క్వార్టర్స్ లో వాకోవర్ ద్వారా క్వార్టర్స్ కు చేరుకుంది. ఇక పురుషుల విభాగంలో లక్ష్యసేన్ తన ప్రత్యర్థి బ్రెజిల్ కు చెందిన వైగర్ పై వరుసగా గేమ్ లలో 21 – 15 , 21 – 11 తేడాతో చిత్తు చిత్తు గా ఓడించి సగర్వంగా క్వార్టర్స్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఇండియా తరపున ఈ టోర్నమెంట్ ఆడుతున్న వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. కాగా సింధు క్వార్టర్స్ లో గావో ఫాంగ్ జీ తో పోటీ పడనుంది.

అయితే గావో గత సంవత్సరం జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ ఛాంపియన్ విజేతగా నిలవడం విశేషం. మరి సింధు ఆమెను నిలువరించి సెమీస్ కు చేరుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news