దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్కామ్ లో నిందితులకి, అలానే ఈ స్కామ్ కి కూడా ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని ఎన్ఐఏ ఏరోజు కోర్టుకు తెలిపింది. ఈ దోవలో గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉఫయోగించారని ఇంటలిజెన్స్ అధికారుల నుండి తమకి సమాచారం ఉందని పేర్కొంది.
అందుకే కేరళ గోల్డ్ స్కామ్ లో ఉన్న ఎవరికీ బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఐఏ కోర్టును కోరింది. అయితే విచిత్రంగా ఈ కేసులో బెయిల్ పిటిషన్ వేసిన స్వప్నా సురేష్ తదితరులు ఈరోజు బెయిల్ పిటిషన్ వెనక్కు తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం గల్ఫ్ దేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్లమాటిక్ కార్గో ద్వారా యూఏఈ కాన్సులేట్ చిరునామాతో ఈ బంగారం తీసుకు రావడంతో ఈ విషయం పెద్దది అయింది.