తెరాస అధినేత కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. తన ఇంటి పేరును ముందు వెనుకాల మార్చి రెండు చోట్లఓట్లు పొందారని ఆరోపించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్ ఆఫ్‌రాఘవరావు అనే పేరు మీద ఒక ఓటు, గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో చంద్రశేఖర రావుసన్ ఆఫ్ రాఘవ రావు అనే పేరు మీద మరో ఓటు హక్కును నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇలా ఒకే వ్యక్తి రెండు పేర్ల మీద ఓటు హక్కును నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాలకు చెందిన లక్షలఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయాన్ని స్వయంగా ఎన్నికల అధికారేఒప్పుకొని క్షమాపణ కోరారని తెలిపారు. అర్హులకు ఓటు హక్కు కల్పించకపోవడం వలన తీరని అన్యాయం జరిగిందనిమండిపడ్డారు. కొడంగల్‌లో తాను ఓడిపోతానని కేసీఆర్, కేటీఆర్‌లు ప్రచారం చేస్తున్నారని, ఓడకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ విసిరిన సవాల్‌నుస్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.