తెలంగాణలో తెదేపా కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి గతంలో చంద్రబాబు చేసిన ట్విట్లను కేటీఆర్ గుర్తుచేశారు. అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయాలని చంద్రబాబు గతంలో చేసిన విమర్శలు.., కాంగ్రెస్‌ను ఇటలీ మాఫియా రాజ్యం అన్నవాళ్లు ఇప్పుడు స్నేహితులయ్యారని విమర్శించారు. అందుకే తాను మహా కూటమిని తాను మహా ఘటియాబంధన్ అంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కాంగ్రెస్, తెదేపాతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలను సైతం తెలంగాణకు అనుకూలంగా ఒప్పించాం…కానీ ఇప్పడు కాంగ్రెస్ – తెదేపా ఏ ప్రాతిపదికన కలుస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.
“Our aim is to make nation free of corrupt congress”.
Famous last words ??#MahaGhatiyaBandhan pic.twitter.com/N6UQfSTePw
— KTR (@KTRTRS) October 9, 2018