చిరంజీవి హైదరాబాద్‌లో.. వెంకటేష్ వైజాగ్‌లో.. ఇవాళ రాత్రికి..

-

ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో తేజ సజ్జ హనుమాన్ , విక్టరీ వెంకటేష్ సైంధవ్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా జనవరి 12న, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమా జనవరి 13న విడుదల కాబోతున్నాయి. హనుమాన్ ,సైంధవ్‌ చిత్రయూనిట్స్ అందరూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఒకే రోజు నిర్వహిచడం గమనార్హం. హనుమాన్ ,సైంధవ్‌ చిత్రాలు రెండూ కూడా ఈరోజు జనవరి 7న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి.

 

సైంధవ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి వైజాగ్ లోని RK బీచ్ వద్దనున్న గోకుల్ పార్క్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి వెంకటేష్ తో పాటు సైంధవ్‌ చిత్ర బృందం అంతా హాజరవుతున్నారు. అలాగే వెంకి ఫ్యాన్స్ కూడా అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.ఇక హనుమాన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. చిరంజీవి ఆంజనేయస్వామికి భక్తుడని అందరికీ తెలిసిన విషయమే. ఈ హనుమాన్ సినిమాలో కూడా హనుమాన్ పాత్రని చిరంజీవే చేసారని వస్తున్న వార్తలపై క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news