లోక్‌సభ ఎన్నికలకు.. సమన్వయకర్తలను నియమించిన ఏఐసీసీ

-

త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే లోక్సభ ఎన్నికలలో గెలిచేందుకు కసరత్తులు చేస్తుంది.. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమిస్తున్నట్లు తెలిపింది.

మహబూబ్‌నగర్‌, చేవెళ్ల సమన్వయకర్తగా సీఎం రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా ,మల్కాజ్‌గిరి బాధ్యతలు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఖమ్మం-మహబూబాబాద్‌ సమన్వయకర్తగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, హైదరాబాద్‌ -సికింద్రాబాద్‌ సమన్వయకర్తగా మంత్రి భట్టి విక్రమార్క కు బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్‌కు సీతక్క,వరంగల్‌కు కొండా సురేఖ, భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,నల్గొండ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, నిజామాబాద్‌ జీవన్‌ రెడ్డి,నాగర్‌ కర్నూల్‌ జూపల్లి కృష్ణారావు, మెదక్‌ దామోదర రాజనర్సింహ, పెద్దపల్లి శ్రీధర్‌బాబు, జహీరాబాద్‌ సుదర్శన్‌ రెడ్డి,కరీంనగర్‌ బాధ్యతలను పొన్నం ప్రభాకర్‌కు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news