ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జ్ఞాన్వాపి మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వసం చేసినట్లు తెలిపారు.
ఇప్పుడు ఉన్న నిర్మాణంలో గతంలో ఉన్న నిర్మాణానికి సంబంధించిన స్తంభాలను ఉపయోగించారు, ముందుగా ఉన్న నిర్మాణం అక్కడే ఉంది” అని ఆయన మీడియా తో అన్నారు.చెక్కిన శిల్పాలను మళ్లీ ఉపయోగించేందుకు ధ్వంసం చేశారని , ప్రస్తుతం మసీదులో మునుపటి నిర్మాణానికి సంబంధించిన 34 శాసనాలు ఉపయోగించబడ్డాయని, ఈ మసీదు తయారు చేసేందుకు ఆలయాన్ని ధ్వంసం చేశారన్నారు జైన్ .శాసనాల్లో రుద్ర, జనారదన,ఉమేశ్వర పేర్లు ,మహా ముక్తి మండపం వంటి పదాలు ఉన్నట్లు వెల్లడించారు.
పురవస్తు శాఖ నివేదిక ప్రకారం.. గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వే చేశారని తెలిపారు. సైట్లో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లు ,ప్రస్తుత నిర్మానం ముందుగా ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు. దేవనాగరి,కన్నడ, తెలుగు ఇతర లిపిలతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను ఉన్నట్లు ఆయన తెలిపారు.ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే రిపోర్టును ఇరు పక్షాలకు ఇచ్చి ఈ రిపోర్టను బహరంగపరచాలని కోర్టు వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.