లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనెల ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కు సంబంధించిన పలు అంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ సిద్ధం చేస్తుంది.తాజాగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించింది. ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్’( ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని ప్రకటించింది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం అయితే ఈసారి బిజెపి ,కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మూడోసారి అధికారం చేజెక్కించుకోవాలని బిజెపి యోచిస్తుంది. అంతేకాకుండా ఈ సారి 400కు పైగా ఎంపీ స్థానాల్లో గెలవాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి పార్టీని ఎలాగైనా ఈసారి ఓడించి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్న ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ ,నితీష్ కుమార్ బయటికి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.