తెలంగాణాలో ఎన్నికలకు ఇక కేవలం అయిదు రోజులు మాత్రం సమయం ఉండడంతో అన్ని పార్టీలు చాలా సీరియస్ గా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారానికి మరో మూడు రోజుల్లో ముగింపు పలకాల్సి ఉంది, ఇప్పటికే అధికారికంగా ఎన్నికల సంఘం అలెర్ట్ జారీ చేసింది. కాగా ఈ రోజు ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మేము బీజేపీతో జటయ్యే అవకాశమే లేదని తెగేసి చెప్పేశారు. అంతే కాకుండా మా మీద ఎంత ఒత్తిడి తెచ్చినా , ఎన్ని సమస్యలు కేంద్రం నుండి కలిగించినా ఆఖరికి మా తల తెగి పడినా ఢిల్లీ కి తలవంచే సమస్యే లేదంటూ కేటీఆర్ చాలా ధీమాగా చెప్పారు. మేము అధికారంలో ఉండగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చాము , వాటిలో లక్షకు పైగా జేబులను అందించినట్లు కేటీఆర్ చెప్పారు.
అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే పది సంవత్సర కాలంలో కేవలం 1012 జాబులే ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి అంతో కేటీఆర్ చెప్పడం జరిగింది.