తెలంగాణాలో రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ వైసీపీ చేస్తున్న ప్రచారం పై జనసేన స్పందించడం జరిగింది. కొల్లాపూర్ నుండి స్వాతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బర్రెలక్క కు మరియు పవన్ కళ్యాణ్ కు మధ్యన వార్ నడుస్తోంది అంటూ ప్రచారం చేస్తున్నారు.. మనుకుంటలో కుక్కని కొట్టినట్లు కొడితే జగన్ ఆ రోజు పారిపోయాడు అంటూ జనసేన కౌంటర్ ఇచ్చింది. తెలంగాణను నేను ఏలుతాను అంటూ వచ్చిన షర్మిలక్క ఇప్పుడు ఏమైనట్లు తన లక్ష్యం ఏమైందంటూ కామెంట్ చేసింది జనసేన. వీరి పిరికి తనంతో పోలిస్తే బర్రెలక్క చాలా దైర్యంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ముందుకు వెళుతోందంటూ జనసేన ప్రశంసించింది. ఇక తెలంగాణాలో జనసేన మొత్తం 8 స్థానాలలో పోటీ చేస్తోంది, అయితే వైసీపీ మరియు YSRTP పార్టీలు ఓటమి భయంతో పారిపోయిన సందర్భాన్ని జనసేన సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసింది.
ఇక బీజేపీకి సపోర్ట్ గా ఉన్న జనసేన ఒక్క సీటు అయిన గెలిచే అవకాశం ఉందా అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.