ప్రస్తుతం ఇండియా దేశవాళీలో భాగంగా 50 ఓవర్ల లిమిటెడ్ దేవధర్ ట్రోపీ జరుగుతోంది. ఇందులో భాగంగా జోన్ ల వారీగా మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు ఈస్ట్ జోన్ మరియు వెస్ట్ జోన్ లకు మధ్యన జరిగిన మ్యాచ్ లో ఈస్ట్ జోన్ 157 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ సీజన్ లో రెండవ సెంచరీ తో అదరగొట్టాడు. ఐపీఎల్ లో విపరీతంగా ట్రోల్ అయిన పరాగ్ ఆట తక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఉన్న ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు మెల్ల మెల్లగా ఆ పేరును పోగొట్టుకోవడానికి తన మజిల్ పవర్ ను చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఇతను కేవలం 68 బంతుల్లోనే 6 ఫోర్లు మరియు 5 సిక్సులతో అలరించాడు.
ఇతనికి తోడుగా ఉత్కర్స్ సింగ్ మరియు కుశాగ్ర లు అర్ద సెంచరీ లతో రాణించారు. కాగా ఇంతకు ముందు ఈ సీజన్ లో ఒక సెంచరీ చేశాడు.