పూజకి, అలంకరణకి మాత్రమే కాదు. గులాబీ వలన ఆరోగ్యానికి అందానికి కూడా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. గులాబీ రేకులని శతాబ్దాలుగా మూలికవైద్యంలో వాడుతున్నారు గులాబీల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, పాలిఫినాల్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి గులాబీ రేకులతో తయారు చేసిన టీ తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. గులాబీ రేకుల టీ వలన ఎలాంటి సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.
రోగనిరోధక శక్తిని పెంచడానికి గులాబీ టీ బాగా ఉపయోగపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని సులభంగా ఇది పెంచగలదు. బరువు తగ్గడానికి దగ్గు జలుబు వంటి సమస్యల నుండి బయటపడడానికి కూడా గులాబీ రేకుల టీ బాగా సహాయం చేస్తుంది. గులాబీ రేకుల టీ ని తీసుకోవడం వలన నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తిమ్మిరి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.
గులాబీ రేకుల టీ ని తీసుకుంటే మానసిక శారీరిక పీరియడ్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. మంచి పెయిన్ కిల్లర్ లాగ ఇది పనిచేస్తుంది. గులాబీ రేకుల టీ తీసుకుంటే జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. గులాబీ రేకుల టీ ని తీసుకోవడం వలన ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి. నిద్ర కూడా బాగా పడుతుంది.
టాక్సిన్స్ ని కూడా ఇది తొలగించగలదు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు. పావు లీటర్ నీటిని మరిగించి గులాబీ రేకులు వేయండి. స్టవ్ నుండి దింపాక ఎనిమిది నుండి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత పూర్తిగా నాని పోనివ్వాలి వడకట్టేసి రెండు టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనే గులాబీ నీళ్లు నిమ్మరసం వేసి తాగాలి.