మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జు ప్రధాని నరేంద్ర మోడికి క్షమాపణలు చెప్పాలని ఆ దేశ జామ హూరీ పార్టీ నాయకుడు ఖాసిం ఇబ్రహీం డిమాండ్ చేశారు. ఇండియాతో వివాదం తర్వాత మాల్దీవ్స్ దౌత్యపరంగా గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. చైనా పర్యటన తర్వాత మోదీపై ముయిజ్జు చేసిన వ్యాఖ్యలను ఖాసిం తప్పుబట్టారు. పొరుగు దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు సరికావన్నారు.
ఇటీవల భారత్-మాల్దీవ్స్ వివాదం వేళ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటించినలో భాగంగా ఆయన ‘మేము చిన్నవాళ్లమే కావొచ్చు. కానీ మమ్మల్ని బెదిరించే హక్కు ఎవరికీ లేదు’ అని మీడియా సమావేశంలో అన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జుకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ, డెమొక్రాట్స్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.